- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనానికి స్పందన.. బాగైన రోడ్డు
దిశ, కాటారం : దిశ కథనానికి స్పందన లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో ప్రధాన రహదారిపై ఏరులై పారుతున్న మురుగునీరుపై దిశలో ప్రచురితమైన కథనానికి వెనువెంటనే గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించింది. కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెం ప్రధాన రహదారిపై మురికి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్త ప్రచురితమైంది.
దీంతో వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తోట జనార్దన్ దిశతో మాట్లాడుతూ.. మంథని కాటారం ప్రధాన రహదారి రోడ్డు నుంచి 5 మీటర్ల ఎత్తు పెంచడంతో ఈ గ్రామ రోడ్డు కిందికి ఉండి మురికినీరు రోడ్లపైన ఉన్నట్లు వివరించారు. రోడ్డు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్‌తో మాట్లాడి మురికి నీరు వెళ్ళి పోయేలా చర్యలు తీసుకోవాలని ఎన్నిమార్లు కోరినప్పటికీ స్పందించలేదని ఎంపీటీసీ జనార్దన్ ఆరోపించారు. రోడ్డుకు అడ్డంగా భూ యజమాని పడిపోవడంతో రోడ్డుపై మురికి నీరు బాగా నిల్వ ఉండి చెరువును తలపించిందని దిశ లోకథనం రావడంతో ప్రజల ఇబ్బందులను గుర్తించి రోడ్డు పై నుండి మురికినీరు ప్రవహించకుండా రోడ్డుపై మట్టిపోసి మురికి నీరు సక్రమంగా పోయేలా చర్యలు తీసుకున్నట్లు ఎంపీటీసీ తోట జనార్ధన్ దిశకు తెలిపారు.