- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు.. బస్టాండ్‌లోనే తల్లీకొడుకు
దిశ, వెబ్ డెస్క్: కరోనా రక్కసి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆసుపత్రికి వెళ్లొచ్చరన్న కారణంతో తల్లికొడుకును ఊర్లోకి రాకుండ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తల్లికొడుకు మూడు రోజులపాటు గ్రామంలోని బస్టాండ్‌లో ఉంటూ నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన సుధా వంట పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. సుధా తన కుమార్తెను డెలివరీ కోసం జూన్ 26 తేదిన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా దగ్గు, ఆయాసం ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ డెలివరీ చేసి పరీక్షలు చేయగా సుధా కుమార్తెకు, పుట్టిన శిశువు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జూన్ 29న సుధా జంగంపల్లికి తన కొడుకుతో రాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. కరోనా పరీక్షలు చేయించుకున్నాకే గ్రామంలోకి అడుగుపెట్టాలని చెప్పారు. దీంతో తల్లీకొడుకు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం గ్రామానికి చేరుకున్నా ఇంటి యజమాని రానివ్వలేదు. దీంతో వారు రెండు రోజులు బస్టాండ్‌లో ఆపై ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నారు. వీరి రిపోర్టులు శనివారం వచ్చే అవకాశం ఉంది.