అడల్ట్ ఫిల్మ్ చూస్తూ ఆంటీకి దొరికిపోయా : బాలీవుడ్ నటుడు

by Shyam |
అడల్ట్ ఫిల్మ్ చూస్తూ ఆంటీకి దొరికిపోయా : బాలీవుడ్ నటుడు
X

దిశ, సినిమా : తాప్సీ, హర్షవర్ధన్ రాణే, విక్రాంత్ మాసే లీడ్ రోల్స్ ప్లే చేసిన చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’. ఈ మర్డర్ థ్రిల్లర్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుండగా.. స్టార్ కాస్టింగ్ అంతా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రాంత్.. చేయకూడని పనిచేస్తూ ఎప్పుడైనా దొరికిపోయారా? అని ఆర్జే అడిగితే, తన చైల్డ్‌వుడ్‌లో జరిగిన ఇబ్బందికర సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

చిన్నప్పుడు ఓ సారి నానమ్మ ఇంటికి వెళ్లినపుడు కజిన్స్‌తో కలిసి అడల్ట్ సినిమా చూస్తుండగా.. రూమ్‌లోకి తన ఆంటీ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిందని రివీల్ చేశాడు. తన జీవితంలో అత్యంత తడబాటుకు గురైన క్షణం అదే అన్నాడు. అయితే ఉదయం 3 గంటల టైమ్‌లో ఆంటీ మేల్కొంటుందని ఊహించలేదని, అప్పుడు సిగ్గుతో చచ్చిపోయానని వెల్లడించాడు. ఆ తర్వాత తన కళ్లల్లోకి చూడాలంటే భయమేసేదని చెప్పుకొచ్చాడు. కానీ ఆంటీ చాలా మంచిదని, ఈ విషయాన్ని అమ్మతో పాటు మరెవరికీ చెప్పలేదని తెలిపాడు. పిల్లలు పెద్దవారయ్యారని అర్థంచేసుకుందని పేర్కొన్నాడు. కాగా వినీల్ మథ్యూ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘హసీన్ దిల్‌రుబా’కు కనిక థిల్లాన్ రైటర్‌గా పనిచేసింది.

Advertisement

Next Story