- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వృధాగా పోతున్న నీటిని చూసి ఎమ్మెల్యే ఏమన్నడంటే..?
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామంలో శానిటేషన్ పనులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలోని విధులల్లో తిరుగుతున్నప్పుడు నల్లాల నుంచి వృధాగా పోతున్న నీటిని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సంరక్షణ మన అందరి బాధ్యత అని గ్రామస్తులకు నీటి సంరక్షణ గురించి వివరించారు. ఉపాధిహామీ పనులు ఎలా జరుగుతున్నాయని స్థానిక సర్పంచ్ ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతులతో మాట్లాడి వారికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్బంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ వికారాబాద్ మండల ప్రెసిడెంట్ కమాల్ రెడ్డి, వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, చిగుల్లపల్లి రమేష్, వికారాబాద్ మండల సర్పంచులు సంఘం ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి, స్థానిక సర్పంచ్ మల్లమ్మ, ఉప సర్పంచ్ నజీమ్ ఉన్నిసా, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.