- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
6 కాదు 60 వారాలైనా అడ్రస్ గల్లంతే: విజయసాయిరెడ్డి
ఆరు కాదు అరవై వారాలు వాయిదా పడినా నీ అడ్రస్ గల్లంతే అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో.. ఈసీ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. ఈసీని పొగడ్తల్లో ముంచెత్తుతూ, సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన విజయసాయిరెడ్డి..
‘బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్యవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్’ అంటూ విమర్శించారు. అంతకంటే ముందు చంద్రబాబు, నారా లోకేశ్‌లు ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.