- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bypoll Election Results: 15 రాష్ట్రాల్లోని 50 స్థానాలకు ఉపఎన్నికలు.. కొనసాగుతున్న కౌంటింగ్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో మొత్తం 50 స్థానాల్లో ఉపఎన్నికలకు(Bypoll Election Results) కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే, మొత్తం 15 రాష్ట్రాల్లోని 50 స్థానాల్లో ఉపఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. కాగా.. మరికొన్నిగంటల్లో 14 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలు, రెండు రాష్ట్రాల్లో రెండు లోక్ సభ స్థానాల ఫలితాలు రానున్నాయి. అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని 48 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్(Wayanad), మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా.. ఉపఎన్నికలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా వయనాడ్ స్థానం మారింది. కాగా.. ఆ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా.. వయనాడ్ లో దాదాపు 50 వేల ఓట్ల ముందంజలో ప్రియాంక కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
యూపీ, బెంగాల్ లోని అత్యధిక స్థానాలకు..
పశ్చిమ బెంగాల్‌లోని 6 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో(RG Kar rape and murder case) ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత ఈ ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల ఫలితాలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి పరీక్షగా మారాయి. ఉత్తరప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే, లోక్ సభ ఎన్నికల రిజల్టే కంటిన్యూ చేయాలని సమాజ్ వాదీ పార్టీ చూస్తుండగా.. ఎలాగైనా యూపీ ఉపఎన్నికల్లో సత్త చాటాలని బీజేపీ భావిస్తోంది.