- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మాటలు అచ్చం అలానే ఉన్నాయ్ : విజయశాంతి
దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో కషాయ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న భారత్ బంద్ సందర్భంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన తీరుపై ఆమె ట్విట్టర్ ద్వారా విరుచుకపడ్డారు.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చేపట్టిన బంద్‌లో చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చేయ్యాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెగ ఆరాటపడ్డారు. ఆయన ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహంతో టీఆర్ఎస్ సర్కారుపై పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి.
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.
దీని ద్వారా కేసీఆర్‌ను కూడా ఇరకాటంలో పెట్టాలని వారి వ్యూహం. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపునకు మద్దతిచ్చిన కేసీఆర్, మరి ఆ పార్టీలు తెలంగాణలో చేసే ఆందోళనల్ని కూడా సమర్థిస్తారా?
రైతు బంధునని చెప్పుకుని, ఫాంహౌస్ రాజకీయాలతో రాబందులా వ్యవహరించే సీఎం దొరగారి నిజస్వరూపం తెలియడం వల్లే ఆయన ‘తుపాకి రాముడు’మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు.
త్వరలో తెలంగాణలోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ సర్కారుపై తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ లీడర్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.