- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మూడు రాజధానులపై విజయసాయిరెడ్డి కవిత్వం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మూడు రాజధానుల ఆమోదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి. బిల్లుల ఆమోదంపై వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో.. టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ అధినేత సైతం ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు రాజధానిలో రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు రాజధానుల అంశంపై తన ట్విట్టర్‌లో ఓ కవిత్వం రాశారు. ప్రస్తుతం మూడు రాజధానులుగా ప్రభుత్వం గుర్తించిన విశాఖపట్నం, అమరావతి, కర్నూలు జిల్లాలను అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.
‘సాగర తీరాన కార్యనిర్వాహక రాజధాని..
కృష్ణమ్మ చెంత శాసన రాజధాని..
చారిత్రక కర్నూలులో న్యాయ రాజధాని
ప్రాంతాల మధ్య ఇక చెక్కుచెదరని అనుబంధాలకు తిరుగులేని పునాది’ అంటూ కవిత్వ రూపంలో తన అభిప్రాయం వెల్లడించారు.
Next Story