- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జగన్, షర్మిల మధ్య విబేధాలు… పవన్, చంద్రబాబు.. విజయమ్మ బహిరంగ లేఖ

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య విబేధాలు ఉన్నాయని, అందుకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారనే వార్తలపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు. జగన్, షర్మిల మధ్య వేర్వేరు అభిప్రాయాలు తప్ప బేధాభిప్రాయాలు లేవన్నారు. ఈ మేరకు ఇవాళ విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో పలు విషయాలను ప్రస్తావించారు.
‘వివేకా హత్య చేసిన వారు ఎవరైనా శిక్షించాలన్నదే మా అందరి అభిప్రాయం. హంతకులను శిక్షించాలన్న సునీత డిమాండ్‌కు మా అందరి మద్దతు. సీబీఐ దర్యాప్తు కేంద్రం చేతిలో ఉందని తెలిసి కూడా పవన్ విమర్శలు చేస్తున్నారు’ అని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.
‘హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అనుమానాలున్నాయి. తిరుపతిలో ఆదినారాయణరెడ్డిని స్టేజీ మీద పెట్టుకుని పవన్ మా కుటుంబంపై విమర్శలు చేశారు. కేంద్రం పరిధిలోనే సీబీఐ ఉందని తెలిసి మరీ పవన్ విమర్శలు చేశారు. వైఎస్ జగన్‌పై 2018లో హత్యాయత్నం జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. రెండు కేసులనూ సీబీఐ, ఎన్‌ఐనే దర్యాప్తు చేస్తున్నాయి’ అని విజయమ్మ తెలిపారు.