షారుఖ్‌ మూవీలో విజయ్.. ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్న కాంబో

by Shyam |   ( Updated:2021-09-07 10:13:08.0  )
thalapathi
X

దిశ, సినిమా : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. షారుఖ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతవారం పుణెలో షూటింగ్ మొదలైన చిత్రంలో నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. అయితే మోస్ట్ కమర్షియల్‌ డైరెక్టర్‌గా ఎదిగిన అట్లీ.. ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడంటే అందులో ఇళయ దళపతి విజయ్ పాత్ర కూడా ఉంది. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘తేరి’ మూవీతోనే కమర్షియల్ సక్సెస్ అందుకున్న అట్లీ.. ఆ తర్వాత ఆయనతోనే తెరకెక్కించిన ‘మెర్సల్, బిగిల్’ చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. కాగా ప్రస్తుతం షారుఖ్‌తో చేస్తున్న మూవీలో విజయ్ కామియో రోల్ ప్లే చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇదే గనుక నిజమైతే.. షారుఖ్ మూవీకి సౌత్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే తన డైరెక్టర్ ఫ్రెండ్స్ కోసం విజయ్ ఇలాంటి ఫేవర్ చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో తనతో ‘పోకిరి, విల్లు’ చిత్రాలు తీసిన ప్రభుదేవా హిందీలో డైరెక్ట్ చేసిన ‘రౌడీ రాథోడ్’ సినిమాలో ‘చింతా త త చిత చిత’ పాటలోనూ కనిపించాడు.

Advertisement

Next Story