టాప్ హీరో.. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్.. నేషనల్ అవార్డ్ డైరెక్టర్

by Shyam |
టాప్ హీరో.. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్.. నేషనల్ అవార్డ్ డైరెక్టర్
X

దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌‌పై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దళపతి విజయ్ తన 66వ సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండటం విశేషం.

ఈ కాంబినేషన్‌పై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనగా.. మూవీ బడ్జెట్‌, ప్రాజెక్ట్‌ విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్‌లో ‘బీస్ట్’ మూవీ చేస్తున్న విజయ్.. అది కంప్లీట్ అవగానే వంశీ పైడిపల్లి మూవీకి డేట్స్ కేటాయిస్తాడని సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించిన వంశీ.. విజయ్ సర్‌తో సినిమా గురించి పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కాగా టెక్నికల్ టీమ్‌తో పాటు ఇతర ఆర్టిస్టులు వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Next Story