- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్‌కు రౌడీ హీరో సర్‌ప్రైజ్!
![vijay-devarakonda vijay-devarakonda](https://www.dishadaily.com/wp-content/uploads/2021/08/vijay-devarakonda.jpg)
దిశ, సినిమా : పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ 2021’ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఫైనలిస్ట్‌గా ఎంపికవగా.. ఇండియన్ ఐడల్ షోలో ఓ తెలుగమ్మాయి ఫైనల్ చేరుకోవడం ఇదే మొదటిసారి. ఇక రేపు(ఆదివారం) జరగబోయే ‘గ్రాండ్ ఫినాలే’లో షణ్ముఖ ప్రియ పార్టిసిపేట్ చేయనుండగా.. హీరో విజయ్ దేవరకొండ వీడియో మెసేజ్ ద్వారా తనకు విషెస్ అందించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తను ‘విజయ్ దేవరకొండకు పెద్ద ఫ్యాన్ అని, ఆయన సినిమాలో పాడటమే తన కోరిక అని’ ఈ యొడెలింగ్ స్టార్ గతంలో ఓసారి షో నిర్వాహకులకు తెలపగా.. సోనీ టీవీ వాళ్లు షణ్ముఖకు విషెస్ తెలపాలని విజయ్‌ను కోరినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ప్రోగ్రామ్ జరగుతున్నప్పుడే వీడియో ద్వారా షణ్ముక ప్రియను సర్‌ప్రైజ్ చేసిన విజయ్.. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా తన నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇస్తానని ప్రకటించాడు. ఈ వీడియో చూడగానే షణ్ముకతో పాటు ఆమె పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. షోలో ఉన్న కంటెస్టెంట్స్, గెస్టులతో పాటు ప్రేక్షకులు విజయ్ ఆఫర్‌ను అభినందించారు.
#IdolShanmukhapriya ke super fan, superstar #VijayDevarakonda ne unhein di apni blessings! Dekhna mat bhooliyega, #IndianIdol2020 #GreatestFinaleEver kal dopahar 12 baje se raat 12 baje tak, sirf Sony par! pic.twitter.com/FztYm37Bvp
— sonytv (@SonyTV) August 14, 2021