‘ముంబైకర్’గా సేతుపతి.. బాలీవుడ్‌కు స్టైలిష్ ఎంట్రీ

by  |
‘ముంబైకర్’గా సేతుపతి.. బాలీవుడ్‌కు స్టైలిష్ ఎంట్రీ
X

దిశ, సినిమా : తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఉంటే చాలు.. ఆ సినిమా తప్పకుండా చూడాల్సిందే అనేంత ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో నిండిపోయింది. తను ఎంచుకున్న క్యారెక్టర్స్‌లో విలక్షణ నటనను ప్రదర్శిస్తున్న సేతుపతి.. ఈ క్రమంలో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తెలుగులో ఆయన విలన్‌గా నటించిన ‘ఉప్పెన’తో పాటు ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ సేతుపతి.. తన ఫస్ట్ లుక్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

‘ముంబైకర్’ సినిమా ‘ఖైదీ’ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తీసిన ‘మానగరం’కు హిందీ రీమేక్. తెలుగులో ‘నగరం’ పేరుతో విడుదలైన ఈ సినిమాలో సందీప్ కిషన్ పోషించిన పాత్రను విజయ్ హిందీలో చేయనున్నారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సె, రణ్‌వీర్ షోరే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో విజయ్ సేతుపతి సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఓ చేతిలో పిల్లాడు, మరో చేతిలో గన్‌తో ఉన్న సేతుపతి గ్యాంగ్‌స్టర్ లుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్ లభిస్తోంది. ఇక సేతుపతి ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల విషయానికొస్తే.. తమిళ్‌లో ‘కాథువాకుల రెండు కాదల్, తుగ్లక్ దర్బార్, కదైసి వివసై’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story