"పుష్ప"లో సేతుపతి లేనట్లే?

by Shyam |
పుష్పలో సేతుపతి లేనట్లే?
X

పుష్ప … స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం. పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీతో బన్నీ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో… బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన బన్నీ … అసలు అలా ఎందుకు చేస్తాడు అనేది సినిమా. కాగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడడంతో సేతుపతి పుష్ప నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ్, హిందీ, తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే సేతుపతి… ఈ సినిమాకు ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉన్నాడట. ఒకవేళ పుష్ప కు కమిట్ అయితే మరో మూడు సినిమాలు వదులుకునే పరిస్థితి ఉండడంతో ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా తప్పుకుంతున్నాడని టాక్. ఆయన స్థానంలో బాబీ సింహాను ఎంచుకుంటారని సమాచారం. బాబీ సింహా పలు తెలుగు, తమిళ్, మలయాళీ చిత్రాల్లో నటించారు.

Tags : Pushpa, Allu Arjun, Sukumar, Vijay Sethupathi, Bobby Simha

Advertisement

Next Story