సేతుపతికి క్షమాపణలు చెప్పిన నెటిజన్..

by Shyam |
సేతుపతికి క్షమాపణలు చెప్పిన నెటిజన్..
X

దిశ, వెబ్ డెస్క్: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ప్రకటనతో విజయ్ సేతుపతి చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ హద్దులు మీరి సేతుపతి కూతురు గురించి అసభ్యకర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా నుంచి తప్పుకోకపోతే అత్యాచారం చేస్తానని హెచ్చరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. కరోనా సమయంలో తన జాబ్ పోయిందని ఆ చిరాకులో అలా మాట్లాడానని, తను చేసింది చిన్న తప్పు కాదని తెలిసినా.. క్షమించమని వేడుకుంటున్నట్లు తెలిపాడు. కనీసం తన కుటుంబాన్ని చూసైనా తనను క్షమించాలన్న ఆయన.. తన ఫ్యామిలీ కోసమే ఇలా వీడియోలో తన ఫేస్ బ్లర్ చేసినట్లు చెప్పాడు. కాగా సేతుపతి సైతం ముత్తయ్య మురళీధరన్ సజెషన్‌తో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story