- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మాస్టర్’కు ఆన్ ద ‘స్పాట్’ షాక్
తమిళ్ సూపర్‌స్టార్ విజయ్‌కు షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. ఏకంగా తను నటిస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి విజయ్ను విచారించారు. దాదాపు ఐదు గంటల పాటు విచారించిన అధికారులు.. కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన బిగిల్ సినిమాకు తళపతి విజయ్ ఎంత తీసుకున్నాడు..? ఆ డబ్బును ఎలా ఉపయోగించాడని ఆరా తీశారు. అంతే కాదు ఏజీఎస్ తో పాటు పలు నిర్మాణ సంస్థలపై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.
ఐటీ అధికారుల విచారణతో మాస్టర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మరీ ఐదు గంటలపాటు ఎందుకు విచారించారు? ఒకవేళ సోదాలు నిర్వహిస్తే ఇంటికి వెళ్లకుండా షూటింగ్ స్పాట్ కే రావాల్సిన అవసరం ఏంటి? అన్న ప్రశ్నలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏజీఎస్ సంస్థ పన్ను ఎగవేతతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏజీఎస్ సంస్థలో బిగిల్ సినిమాకు వర్క్ చేసిన విజయ్ను ప్రశ్నించినట్లు సమాచారం.