విజయ్ దేవరకొండపై ఆర్జీవీ ట్వీట్‌తో నెటిజన్స్ షాక్.. ఏంటి ప్లాన్ అంటూ..

by Shyam |
liger
X

దిశ, సినిమా: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్‌’. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్‌ను విజయ్ తన అభిమానులతో ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు తను బాక్సింగ్ లెజెండ్ ‘మైక్ టైసన్’తో దిగిన స్పెషల్ పిక్‌ను పోస్ట్ చేసిన విజయ్.. ‘లెజెండ్‌తో ప్రతీ మూమెంట్ గొప్పదే.. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లైగర్‌ వర్సెస్‌ లెజెండ్‌. ఐరన్‌‌తో తలపడబోతున్నా’ అంటూ రాసుకొచ్చాడు. రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌తో పాటు మైక్ టైసన్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ అప్‌డేట్‌పై స్పందించిన ఆర్జీవీ.. ఈ కాంబినేషన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ‘ఇండియన్ టైగర్ దేవరకొండ.. అమెరికన్ లయన్‌ మైక్ టైసన్ లాస్ వెగస్‌లో షూటింగ్‌లో కలిశారు. దీన్నే నేను పంచ్ పవర్ అంటాను’ అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఏంటి వర్మ మరీ అంత పొగిడేస్తున్నావు.. కొంపదీసి విజయ్ దేవరకొండతో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశావా ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆర్జీవీ త్వరలో ఎవరితో సినిమా చేస్తాడో వారిని ఇలాగే హైప్ చేస్తాడని కామెంట్ చేస్తున్నారు. కాగా గతంలో మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్, టైగర్ ష్రాఫ్‌ల సూపర్ క్రాస్ విజయ్ దేవరకొండ అని ఆర్జీవీ ప్రశంసించాడు.

Advertisement

Next Story