- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్జున్ రెడ్డి.. 'రౌడీ హగ్'
విజయ్ దేవరకొండ సినిమా అంటే జనాల్లో క్రేజ్ మూమూలుగా ఉండదు. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ కూడా చెప్పాడు. తాను ఎలాంటి ప్రమోషన్స్ చేయకున్నా తన సినిమా ప్రేక్షకులకు రీచ్ అవుతుందనేది విజయ్ ధీమా. ఇక ప్రమోషన్స్ చేశాడే అనుకో .. విజయ్ మార్క్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్‌లో వెరైటీ డ్రెస్సులతో ఫ్యాన్స్‌ను మీట్ అయ్యే విజయ్… ఈ సారి వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్‌లో మాత్రం అలా చేయలేదేంటని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా అలాగే ఫీలయ్యారు.
ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న వరల్డ్ ఫేమస్ లవర్‌కు.. విజయ్ తన అంతకు ముందు సినిమాలకు ప్రమోషన్స్‌లో ఇచ్చినంత బిల్డప్ ఇవ్వలేదు . కానీ బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన మార్క్ స్టైల్‌ను చూపించాడు. లుంగీ, షర్ట్, తల పాగాతో ఈవెంట్‌కు హాజరై ఫ్యాన్స్‌కు ‘రౌడీ హగ్’ ఇచ్చాడు. దీంతో ‘ఇది కదా మాకు కావాల్సింది’ అంటూ రౌడీ ఫ్యాన్స్ తెగ సంబురపడి పోయారు. తనదైన స్టైల్లో అభిమానులకు అభివాదం చేసిన విజయ్… వరల్డ్ ఫేమస్ లవర్‌కు నేను ప్రమోషన్స్ చేయకపోయినా ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయని, దీనికి కారణం మీరే అంటూ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘నేనెక్కడికి వెళ్లినా నాకు సపోర్ట్ చేస్తున్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని’ భావోద్వేగంగా మాట్లాడాడు.
విజయ్ తర్వాతి చిత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తుండగా .. ఇందుకు సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అందువల్లే విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్‌కు కొద్ది సమయాన్ని మాత్రమే కేటాయించారు.