- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
" ఫైటర్" లో విజయ్ పాత్ర అదిరిందిగా…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ … పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో “ఫైటర్” సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారానే రౌడీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విజయ్ పూరీ కాంబినేషన్ అంటేనే ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ … అంచనాలకు మించి ఉండబోతోందని టాక్. సినిమాలో విజయ్ మాఫియా డాన్ కొడుకుగా కనిపించబోతున్నారు అని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ తర్వాత డాన్ కొడుకే మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడట. ఇదే సినిమాలో ట్విస్ట్ కాగా… విజయ్ పై చిత్రీకరించే యాక్షన్ సీక్వెన్స్ లు మూవీకి హైలైట్ గా నిలవనున్నాయట. దీంతో విజయ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని… తన స్టైల్, యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రెట్టీ గాళ్ అనన్యా పాండే నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న అనన్య… తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుందట.
ఇదిలా ఉంటే పూరీ జగన్నాధ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయి… ఏప్రిల్ 20కి 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా పూరితో ఉన్న ఫోటోను షేర్ చేసిన విజయ్… నేను ఆరో తరగతిలో పూరీ ఫస్ట్ సినిమా “బద్రి” చూసాను. ఇందులోని హేయ్ చికితా పాట చాలా కాలం పాడుకున్నా అని తెలిపాడు. కరోనా కారణంగా ఫైటర్ షూటింగ్ వాయిదా పడడంతో… పూరి నిన్ను, మన సినిమా షూటింగ్ ను మిస్ అవుతున్నానని చెప్పాడు. నేను నటుడిగా రిటైర్ అవ్వాలని అనుకునేంత వరకు మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.
Tags : Vijay devarakonda, Puri Jagannath, Tollywood, Fighter