- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లారెన్స్ చొరవ.. అభిమాని కోరిక నెరవేర్చనున్న విజయ్, అనిరుధ్
రాఘవ లారెన్స్.. దేవుడిని వెతుక్కుంటూ చాలా వెతికాను.. కానీ ఆ దేవుడు ఎక్కడో లేడు నా తల్లి రూపంలో తనతోనే ఉన్నాడు.. ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్నాడు అని తెలుసుకున్నాను.. అందుకే తల్లికి గుడి కట్టి పూజిస్తున్నాను అంటాడు. నాలుగేళ్ల క్రితం అమ్మకు గుడి కట్టి ఆరాధిస్తున్న లారెన్స్.. మదర్స్ డే సందర్భంగా ఆ దేవాలయాన్ని అందరు తల్లులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. అంతే కాదు మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.
My Big thanks to Nanban Vijay and Anirudh sir @actorvijay @anirudhofficial pic.twitter.com/ZULMRngOaf
— Raghava Lawrence (@offl_Lawrence) May 10, 2020
తన దగ్గర ఉన్న వికలాంగులైన పిల్లల్లో ఒకడైన తాన్ సేన్ కు మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే ఇష్టమట. తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ చిత్రంలోని పాటలను ఆ హీరో ముందు ప్లే చేయాలనేది అతని కోరికట. అంతే కాదు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కలిసి పని చేయాలనేది తన డ్రీమ్ అంట. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ విజయ్ కు ఫోన్ చేసి వివరించగా .. లాక్ డౌన్ ముగిసి పరిస్థితులు సాధారణం కాగానే తాన్ సేన్ ను తీసుకురావాలని చెప్పారట విజయ్. తనను కలవాలని నాకు కూడా ఉందని.. తప్పకుండా కలుస్తానని చెప్పారట. అనిరుధ్ తో మాట్లాడగా తన ట్రూప్ లో పని చేయాలన్న తాన్ సేన్ కల నెరవేరుస్తానని చెప్పాడట. దీంతో విజయ్, అనిరుధ్ లను చూసి గర్వపడుతున్నాం అంటున్నారు ఫ్యాన్స్. లారెన్స్ కేరింగ్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు.