విజయ్, సేతుపతితో నయన్ లవర్

by Shyam |
విజయ్, సేతుపతితో నయన్ లవర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మాస్టర్’ .. తళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం. విజయ్, సేతుపతిల కాంబినేషన్‌తో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడగా… మూవీ కోసం తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘మాస్టర్’ ఆడియో లాంచ్ సక్సెస్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసిన మూవీ యూనిట్ సినిమాపై అభిమానుల్లో ఫుల్ క్రేజ్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. మాస్టర్ ఆల్బమ్‌లో ఏడు పాటలుండగా… ఒక థీమ్ సాంగ్‌ను కూడా యాడ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. తమిళనాట ఎక్కడ చూసినా ఇవే పాటలు వినిపిస్తుండగా… ఆల్బమ్‌లో సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా పాడగా.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లిరిక్స్ అందించిన ‘పటాకా సాంగ్’ ట్రెండ్ అయింది.

కాగా ‘మాస్టర్’ ఆడియో లాంచ్‌కు హాజరైన డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో విజయ్, సేతుపతిలతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. విజయ్‌ కోసం ఫస్ట్ సాంగ్ రాయడం చాలా ఆనందంగా ఉందన్న విఘ్నేష్.. ఈ టైం కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నానని… నా కలను సాకారం చేసిన అనిరుధ్, డైరెక్టర్ లోకేష్‌లకు థాంక్స్ చెప్పారు. ఇక మాస్టర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతితో మళ్లీ వర్క్ చేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపాడు. స్వీటెస్ట్, హ్యాండ్‌సమ్, టాలెంటెడ్ హీరో విజయ్‌పై ప్రేమ పెరుగుతుందని… ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా ప్రారంభించేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని తెలిపాడు. ఈ సినిమాలో విఘ్నేశ్ శివన్ గర్ల్ ఫ్రెండ్ నయనతారతో పాటు సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఇంతకు ముందు విజయ్ సేతుపతితో ‘నానుమ్ రౌడీ తాన్’ సినిమా చేశాడు విఘ్నేష్.

tags : Vijay, Vijay Sethupathi, Vignesh Shivan, Nayanthara, Master

Advertisement

Next Story

Most Viewed