గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నయన్, శివన్

by Anukaran |
గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నయన్, శివన్
X

దిశ, వెబ్‌డెస్క్: నయన్ శివన్ క్రేజీ లవ్ బర్డ్స్.. నిజానికి ఈ జంట అంటే గాసిప్స్‌కు క్రేజ్.. రూమర్స్‌కు క్రేజ్.. మీడియాకు ఐతే సూపర్ క్రేజ్. ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు కలిసి ఉంటారా? లేదా? ఉంటే ఎన్నాళ్లు కలిసి ఉంటారు? అన్నీ ముందే ఊహించేసి రాస్తుంటారు. ఇన్ని ఊహాగానాలు వద్దు కానీ, మా అప్‌డేట్స్ మేమే ఇస్తామని డిసైడ్ అయిన ఈ ఇద్దరు.. ఎక్కడికెళ్లినా వారి స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నారు. ‘ఓనం’ సమయంలో ఫ్లైట్ దిగిన దగ్గరి నుంచి పర్సనల్‌గా ఫోటోలు దిగే వరకు అన్నీ షేర్ చేసుకున్న నయన్ శివన్.. ఇప్పుడు గోవా ట్రిప్‌ తాజా సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

https://www.instagram.com/p/CFFLdXSBfzE/?igshid=1t57b2nx1go3b

గర్ల్ ఫ్రెండ్ నయన్, తల్లితో కలిసి గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. హాలిడే మూడ్ నుంచి వెకేషన్ మూడ్‌లోకి వచ్చిన తాము గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల పాటు ఇక్కడే తన నెక్స్ట్ మూవీ స్టోరీ కూడా రాయబోతున్నట్లు తెలిపిన శివన్.. నయన్ సూపర్ కూల్ పిక్స్‌తో పాటు తల్లి స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

https://www.instagram.com/p/CFHOVXGB_5f/?igshid=1lqvt8rzwexfm

కాగా, పెళ్లి అనే రూమర్లకు స్వస్తి చెప్తూ ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు శివన్. డేటింగ్ బోర్ కొడితే తప్ప, పెళ్లి అనే తంతు వరకు వెళ్లమని.. ఆ టైమ్ వస్తే తప్పకుండా ఆ న్యూస్ షేర్ చేస్తామని చెప్పాడు.

https://www.instagram.com/p/CFHPz_Gh1r4/?utm_source=ig_web_copy_link

Read Also….

హీరో సూర్యపై చర్యలు తీసుకోవాల్సిందే !

Advertisement

Next Story