నయన్- విఘ్నేష్ మోస్ట్ రొమాంటిక్ పిక్

by Shyam |
Vignesh,-Nayanthara
X

దిశ, సినిమా : కొన్నేళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ‘లేడీ సూపర్‌స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్’.. లవ్‌లో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన సింగిల్ పిక్ కూడా క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోతోంది. ఇక తమ రిలేషన్‌షిప్‌పై చాలా ఓపెన్‌గా ఉండే ఈ ప్రేమ జంట.. కొంతకాలంగా పెళ్లి విషయం మాత్రం దాటవేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ అభిమానులకు తమ రొమాంటిక్ యాంగిల్‌ను చూపించే పిక్స్ షేర్ చేస్తుండే జంట.. తాజాగా ఒక త్రో బ్యాక్ పిక్ షేర్ చేసింది.

ఇది పారిస్ ట్రిప్‌లో తీసుకున్న ఫొటో అని తెలుస్తుండగా.. ఒకరినొకరు దగ్గరగా చేరి, కిస్ చేసుకుంటున్నట్టుగా ఉన్న స్టిల్ వారి రొమాంటిక్ మూడ్‌ను తెలుపుతోంది. మరోవైపు అదే స్టిల్‌ను తన చేతిలోని ఫోన్‌తోనూ నయన్ క్యాప్చర్ చేయడం విశేషం. ఈ ఫొటో ఒకవిధంగా సోషల్ మీడియాను షేక్ చేసిందనే చెప్పొచ్చు. 2016లో ‘నానుం రౌడీదాన్’ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. దాదాపు ఐదేళ్ల నుంచి రిలేషన్‌‌షిప్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ మూవీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండగా.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story