బాలీవుడ్ యాక్టర్ స్టన్నింగ్ పిక్.. విశ్వాన్ని చీల్చే శరీరం అతడిది!

by Shyam |
vidyut jammwal
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమాల్ ‘కమాండో’ సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వతహాగా ట్రైన్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన విద్యుత్.. ప్రపంచంలోనే అత్యంత పురాతన యుద్ధ క్రీడ ‘కలరియపట్టు’ను మూడేళ్ల వయసు నుంచే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి, ఊసరవెల్లి’తో పాటు ఇళయ దళపతి విజయ్ ‘తుపాకీ’ చిత్రాల్లో నటించిన విద్యుత్ జమాల్ ప్రస్తుతం ‘ద పవర్’ పేరుతో జీప్లెక్స్ నిర్మిస్తున్న మూవీలో నటిస్తున్నాడు. కాగా విద్యుత్ ఫిజిక్ గురించి అభివర్ణిస్తూ ఇండియా టాప్ పర్సనాలిటీ అనే మ్యాగజైన్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో అతడి స్టన్నింగ్ ఫొటోను షేర్ చేసింది. బాలీవుడ్స్ వెరీ ఓన్ ‘కమాండ్’ క్యాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘వావ్, ఎక్స్‌ట్రార్డినరీ’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘విద్యుత్ ది గ్రేట్’ అని సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఇళయ దళపతి విజయ్ 65వ సినిమాలో విద్యుత్ జమాల్ విలన్ రోల్ ప్లే చేయబోతున్నట్లు వార్తలొస్తుండగా, ఈ విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

Advertisement

Next Story