- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెరీర్ మొదట్లో టార్చర్ అనుభవించా : విద్య ప్రదీప్
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. అన్ని సినిమా ఇండస్ట్రీల్లోని లోపాలను, నెపోటిజాన్ని ఎత్తి చూపుతోంది. చాలా మంది హీరోయిన్లు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు దీనిపై స్పందిస్తున్నారు. చివరకు ప్రముఖ సింగర్స్ సోనూ నిగమ్, అద్నాన్ సమీలు కూడా తమ రంగంలోని చీకటి కోణాల గురించి ప్రపంచానికి తెలియజెప్పారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే.. ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టమని ఎంతోమంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ నటి విద్య ప్రదీప్ నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘అవళ్ పేర్ తమిళరసి’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన నటి విద్యా ప్రదీప్. ఆ తర్వాత ప్రొప్రైటర్స్ అనే మళయాల సినిమాలో కామియో అప్పియరెన్స్ ఇచ్చింది. 2014లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘శైవం’ చిత్రంలో పోషించిన క్యారెక్టర్‌తో మంచి నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. అయినా తాను ఈ రంగంలో ఎంతో టార్చర్‌కు గురయ్యానని, ఒకేసారి ఆరు సినిమా ఛాన్స్‌లు కోల్పోయానని తెలిపింది. ఏ కారణంతో సినిమాల నుంచి తప్పించారనే విషయాన్ని కూడా తనకు చెప్పలేదన్నారు. అప్పుడు తనకు గుండెలు పలిగినంత బాధ అనిపించిందని, ఇక్కడ తన వల్ల కాదనుకుని మళ్లీ చదువుకోవాలనుకున్నానని తెలిపింది. అదే సమయంలో ‘తడం’ చిత్రంలో నటించే అవకాశం దక్కిందన్నారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు లభించదన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ లేని తనలాంటి వారు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని, ఎవరూ పట్టించుకోరని కూడా చెప్పింది. నిర్మాతలు తలచుకుంటే ఏమైనా చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. టార్చర్‌ను తట్టుకుని నిలబడే సత్తా ఉంటేనే సినిమాల్లో ప్రయత్నించాలంటూ కొత్త వారికి సూచించింది విద్య.
ప్రస్తుతం ఒత్తైక్కు ఒత్త, అసుర కులం, తలైవి వంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే విద్యకు పేరు తెచ్చిన ‘తడం’సినిమానే తెలుగులో ‘రెడ్’ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటించగా, కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.