రిస్క్ తీసుకున్న హీరో విశాల్.. తృటిలో తప్పిన ప్రమాదం

by Shyam |
Actor Vishal
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరో విశాల్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఫైటింగ్ సీన్ లో హీరో విశాల్ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో విశాల్‌కు గాయాలేమీ కాకపోవడంలో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

వివరాల ప్రకారం.. హైదరాబాదులో హీరో విశాల్ 31వ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి పి. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీకి ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ డూప్ లేకుండా ఫైటింగ్ సీన్‌లో నటిస్తున్నారు. ఓ ఫైటింగ్ సీన్ షూట్ చేస్తుండగా విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. దీంతో తృటిలో పెను ప్రమాదం నుంచి హీరో బయటపడ్డాడు.

ఈ ప్రమాదంపై హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అదృష్టవశాత్తు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని వెల్లడించారు. ఈ సీన్‌లో ఆ ఫైటర్ తప్పేమీలేదని తెలిపారు. కొంచెం టైమింగ్ తప్పిందని, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని పేర్కొన్నారు. భగవంతుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నానని విశాల్ వెల్లడించారు.

Advertisement

Next Story