హార్న్‌బిల్‌ పక్షితోనే ఆటలా…

by Shyam |   ( Updated:2021-03-30 05:01:19.0  )
హార్న్‌బిల్‌ పక్షితోనే ఆటలా…
X

దిశ, వెబ్ డెస్క్ : కొన్నిసార్లు మనుషుల కన్నా జంతువులే ఎక్కువ తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాయి. వాటి తెలివి చూసి ఔరా! అని ముక్కున వేలువేసుకోవడం మనుషుల వంతు అవుతుంది. ఆపద సమయాల్లో జంతువులు ప్రదర్శించే తెలివితేటలు అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఒక ముంగిస తెలివికి యావత్ సోషల్ మీడియా సలాం చేయడంతో పాటు ఆస్కార్ అవార్డును కూడా ప్రకటించేసింది.

మనం చిన్నప్పుడు చాలా పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. ఒక అడవిలోకి ఇద్దరు స్నేహితులు వెళ్తారు. అక్కడ వారికి ఒక ఎలుగు బంటు కనిపిస్తుంది. దీంతో ఒక స్నేహితుడు చెట్టుపైకి ఎక్కేస్తాడు. చెట్టు ఎక్కడం రాని స్నేహితుడు కిందపడిపోయి చచ్చిపోయినట్లు నటిస్తాడు. ఎలుగు వచ్చి అతను చనిపోయాడనుకొని వెళ్ళిపోతుంది. ఇది మన అందరికీ తెలుసు కానీ ఆ ముంగిసకు ఎలా తెలిసి ఉంటుంది? ఇక్కడ కూడా సేమ్ కథలో లానే పక్షికి వల వేద్దామని ముంగిస దాని ముందుకు వెళ్తుంది. అంతలో ముంగిసకు పక్షి ఝలక్ ఇవ్వడంతో ఇక ముంగిస నటనా ప్రావీణ్యం మొదలు పెట్టింది.

అక్కడి నుండి తప్పించుకోకపోతే మనకే ముప్పు అనుకుందో, ఏమో కానీ సడెన్ గా చచ్చిపోయినట్లు పడిపోయింది… సరే అని పక్షి ముందుకు కదలగానే ముంగిస మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నించింది. అంతలో పక్షి వెనక్కి తిరగడం ఈ ముంగిస మళ్ళీ కిందపడిపోవడం ఇలా రెండు మూడు సార్లు చేయడం ఈ వీడియో లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చావు తెలివితేటల ముంగిసా… నీ నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ ఫన్నీ సంఘటన దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్‌ గేమ్‌ రిజర్వ్‌లో చోటుచేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed