కత్రినా ఇంట్లో ఐదుగంటలు గడిపిన హీరో

by Shyam |
కత్రినా ఇంట్లో ఐదుగంటలు గడిపిన హీరో
X

దిశ, సినిమా : ‘ఉరి’ సినిమాతో గుర్తింపు పొందిన నటుడు విక్కీ కౌశల్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు రూమర్స్ వినబడుతున్నాయి. తమ రిలేషన్‌ గురించి అఫిషియల్‌గా బయటపెట్టకపోయినా వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇటీవల కత్రీనా ఇంటికెళ్లి ఐదుగంటలు స్పెండ్ చేసిన విక్కీ.. తన బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారులో తిరిగి వెళ్తుండగా మీడియా కంటికి చిక్కినట్టు తెలుస్తోంది.

ఇక విక్కీ బర్త్‌డే రోజున అతడి త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన కత్రీన.. ‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే విక్కీ కౌశల్, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి’ అంటూ విషెస్ తెలిపింది. కాగా ఏప్రిల్ 5న విక్కీ తనకు కొవిడ్ పాజిటివ్ కన్ఫామ్ అయినట్టు తెలిపిన వెంటనే, తన లేడీలవ్ కూడా పాజిటివ్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్‌పై బాలీవుడ్ మీడియా కూపీ లాగుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే విక్కీ.. ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ, సర్దార్ ఉద్దమ్ సింగ్‌తో పాటు శ్యామ్ మానిక్ షా బయోపిక్‌లో నటిస్తుండగా.. కత్రినా ‘ఫోన్ బూత్, సూర్యవంశీ’ చిత్రాలతో బిజీగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed