విక్కీ కౌశల్ నెక్స్ట్ లుక్..

by Shyam |   ( Updated:2023-05-19 12:55:07.0  )
విక్కీ కౌశల్ నెక్స్ట్ లుక్..
X

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్.. ‘ఉరి’ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ధర్మ ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘భూత్ పార్ట్ వన్ : ద హాంటెడ్ షిప్‌’లో నటించిన విక్కీ.. ఆ తర్వాత సూపర్ ప్రాజెక్టులకు సైన్ చేశాడు. వీటిలో ఇండియన్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ‘సామ్ మానేక్షా’ బయోపిక్ ఒకటి కాగా.. ఈ సినిమాపై అభిమానులకు ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ‘ఉరి’ తర్వాత అంత గొప్ప రోల్ ఇదే కాగా.. జూన్ 27న సామ్ మానేక్షా వర్ధంతి సందర్భంగా తనను స్మరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు విక్కీ. ఈ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ.. ఇండియన్ ఆర్మీ బ్రేవ్ హార్ట్ సోల్జర్‌కు అంజలి ఘటించాడు.

సోల్జర్స్‌తో మధ్యలో నడుస్తున్న ఇండియన్ బ్రేవ్‌మెన్ ‘సామ్ మానేక్షా’ ఫొటోను ముందుగా షేర్ చేసిన విక్కీ కౌశల్.. ఆ తర్వాత సామ్ మానేక్షా గెటప్‌లో ఉన్న తన ఫొటోను వీడియోలో యాడ్ చేశాడు. ఈ విధంగా తన నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ‘ఈ సినిమా ప్రయాణం.. బ్రేవ్ సోల్జర్‌గా ఆ పాత్రలో జీవించడం చాలా ప్రత్యేకం’ అని తెలిపిన విక్కీ.. దేశాన్ని రక్షిస్తున్న భారత సైనికుల సేవలకు హ్యాట్సాఫ్ చెప్పాడు.

ఇక విక్కీ ఫస్ట్ లుక్ అదిరిపోయిందంటున్న అభిమానులు.. ఉరిని మించిన హిట్ కొడతాడని ధీమా వ్యక్తం చేస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Advertisement

Next Story