కత్రినాతో డేటింగ్‌పై విక్కీ కామెంట్స్

by Shyam |
కత్రినాతో డేటింగ్‌పై విక్కీ కామెంట్స్
X

బాలీవుడ్‌లో ప్రేమాయణం కామన్. ఒకరిని వదిలి మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం చాలా సాధారణం. చాలామంది స్టార్స్ ఇలా రిలేషన్ షిప్‌లో ఉండి విడిపోయి తర్వాత వేరే వారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే… కొందరు ప్రేమించిన వారినే పెళ్లాడారు. అయితే ఈ మధ్య నేషనల్ అవార్డు విన్నర్ విక్కీ కౌశల్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మీడియాలో, పత్రికల్లో వీరి మధ్య బంధంపై చాలా ప్రచారం జరిగింది.

ఈ విషయాన్నే విక్కీ కౌశల్ దగ్గర ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పకుండా చక్కగా తప్పించుకున్నారు. కత్రినాతో డేటింగ్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు విక్కీ. నా పర్సనల్ లైఫ్‌ను చాలా రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నాను అని చెప్పారు. ఈ విషయంలో నేను ఓపెన్ అప్ అయిపోతే… లేని పోని తలనొప్పి ఉంటుందన్నారు. కొందరు తప్పుగా అనుకుంటే… మరికొందరు దీనిపై చర్చలే మొదలెట్టేస్తారన్నారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలన్న విధంగా ఆన్సర్ ఇచ్చారు విక్కీ.

Advertisement

Next Story