ఉప సర్పంచ్ ఆత్మహత్య.. కారణం ఇదే!

by Sumithra |
ఉప సర్పంచ్ ఆత్మహత్య.. కారణం ఇదే!
X

దిశ, మునుగోడు : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉపసర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. సన్నిహితుల కథనం ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మెండబోయిన వేణుగోపాల్(35) తన వ్యవసాయ భూమితో పాటు మరికొన్ని ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు.

దిగుబడి వచ్చాక పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఆందోళనకు గురైన వేణుగోపాల్ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్సై జి.కరుణప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story