బైకును ఢీకొన్న కారు.. తెగిపడిన ఉప సర్పంచ్ కాలు

by Sridhar Babu |   ( Updated:2020-05-09 13:47:50.0  )
బైకును ఢీకొన్న కారు.. తెగిపడిన ఉప సర్పంచ్ కాలు
X

దిశ‌, ఖ‌మ్మం :
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్లు వద్ద శ‌నివారం బైకును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో గ్రామ ఉప సర్పంచ్ సీతారాములుకు తీవ్ర‌గాయాలయ్యాయి. ఆయన కాలు పూర్తిగా తెగిపడింది. గ్రామ‌స్తులు వెంటనే సీతారాములును ఖ‌మ్మంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.కాగా, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

car and bike hit, road accident, leg cut, vice sarpanch injured

Advertisement

Next Story