ఏటీఎం ద్వారా.. ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా

by vinod kumar |
ఏటీఎం ద్వారా.. ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా
X

ఏటీఎం మెషీన్ ద్వారా ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా సోకింది. ఈ ఘటన గుజరాత్‌లోని బరోడా జరిగింది. బరోడాలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది ఒకే రోజున ఏటీఎం నుంచి ముగ్గురు డబ్బులు విత్‌డ్రా చేశారు. అయితే గతంలో కరోనా సోకిన వ్యక్తి ఆ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేశారు. దీంతో ముగ్గరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో వీరికి కాంటాక్ట్‌లో ఉన్న 28 మందిని ఆర్మీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. దీంతో మొత్తం ఆర్మీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

Tags : ATM, Corona, Army staff, 3 members, Quarantine, gujarath, baroda

Advertisement

Next Story