జియోకు పోటీగా వొడాఫోన్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్!

by Harish |
Vodafone
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ల కోసం కొత్త డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. అపరిమిత వాయిస్‌కాల్స్, 25జీబీ డేటాతో నెల రోజుల కాలపరిమితి కలిగిన ఈ సరికొత్త ప్లాన్ ధర రూ. 267గా కంపెనీ తెలిపింది. దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 247 ప్లాన్‌కు పోటీగా వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో పాటు రూ. 128 రీఛార్జ్‌తో వొడాఫోన్ ఐడియా మరో ప్లాన్‌ను కూడా వెల్లడించింది. దీనికి 28 రొజుల వరకు ఆన్‌నెట్ మినిట్స్ ఉచితంగా లభిస్తాయి. రూ. 267 ప్రీపెయిడ్ ప్లాన్‌లో పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, వీఐ మూవీస్, టీవీ యాప్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, రూ. 128 ప్లాన్‌లో 10 లోక ఆన్‌నెట్ నైట్ మినిట్స్, సెకనుకు 2.5 పైసలతో లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌ను 28 రోజుల కాలపరిమితితో లభిస్తుందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed