- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్‌తో సినిమాపై వెట్రిమారన్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ వెట్రిమారన్ సినిమా తీశాడంటే బాక్సాఫీస్ హిట్ పక్కా. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్‌ఫుల్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన.. నెక్స్ట్ ఇళయ దళపతి విజయ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ‘మాస్టర్’ సినిమా తర్వాత వెట్రిమారన్ – విజయ్ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లనుందనే అందరూ ఆశించారు. కానీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సినిమా కన్‌ఫర్మ్ అయిపోయింది. దీంతో కాస్త నిరాశ చెందినట్లు కనిపించిన వెట్రిమారన్.. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లోనైనా విజయ్‌తో సినిమా చేస్తానని చెప్పాడు. అంతేకాదు విజయ్ కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసిన వెట్రిమారన్.. మాస్ ఎంటర్‌టైన్మెంట్ రెడీ చేసినట్లు చెప్పాడు.
కాగా, వెట్రిమారన్ ప్రస్తుతం ధనుష్ ‘అసుర’ సినిమాతో బిజీగా ఉండగా.. తర్వాత సూర్య హీరోగా ‘వాడివసల్’ సినిమా డైరెక్ట్ చేయనున్నారు. ఇది కంప్లీట్ అయ్యాక విజయ్‌తో మూవీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. మరో వైపు విజయ్ మాస్టర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఏఆర్ మురుగదాస్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత వెట్రిమారన్ అండ్ విజయ్ కాంబినేషన్ వర్క్‌అవుట్ అయ్యే చాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ టాక్.