- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండస్ట్రీలో విషాదం: మ్యూజిక్ డైరెక్టర్ రామ్ లక్ష్మణ్ మృతి
దిశ, సినిమా: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ్(ఐకానిక్ రామ్‌లక్ష్మణ్) కన్నుమూశారు. సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’, మాధురీ దీక్షిత్ ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన ఆయన.. ఈ రోజు ఉదయం నాగ్‌పూర్‌లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందారు. ఆరు రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 78ఏళ్ల సంగీత దర్శకుడు బలహీనంగా మారిపోయాడని, ఇంట్లోనే వైద్యం తీసుకున్నాడని.. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మరణించాడని కొడుకు అమర్ తెలిపాడు.
లక్ష్మణ్ సొంత పేరు విజయ్ పాటిల్ కాగా.. తన కొలాబొరేటర్ సురేంద్రతో కలిసి రామ్-లక్ష్మణ్ పేరుతో మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాడు. పాండు హవల్దార్(1975) అనే మరాఠీ సినిమాకు తొలిసారిగా పనిచేయగా.. సురేంద్ర 1976లోనే కన్నుమూశారు. అయినా సరే రామ్-లక్ష్మణ్ స్క్రీన్ నేమ్‌తో విజయ్ పాటిల్ తన జర్నీ కొనసాగించారు. నాలుగు దశాబ్ధాలకుపైగా సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆయన హిందీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో 150కిపైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు.