- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి.. బీసీసీఐకి స్కోరర్ల వినతి
దిశ, స్పోర్ట్స్ : దేశంలో జరిగిన అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకే కాకుండా దేశవాళీ క్రికెట్‌కు సంబంధించిన కీలక మ్యాచ్‌లకు స్కోరర్లుగా ఎన్నో ఏళ్లుగా పలువురు సేవలు అందిస్తున్నారు. స్కోరర్ల రిటైర్మెంట్ వయసు 55 ఏళ్లు మాత్రమే ఉండటంతో తమ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని గత కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. స్కోరర్స్‌కు ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం లేదని.. కేవలం కూర్చొని చేసే పనే కాబట్టి రిటైర్ అయ్యే వయసును పెంచాలని కోరారు. దీంతో గతంలో 55 ఏళ్లు ఉన్న రిటైర్మెంట్ ఏజ్‌ను 60 సంవత్సరాలకు పెంచారు. అయితే గత 30 ఏళ్లుగా బీసీసీఐ కోసం పని చేసి రిటైర్ అయిన చాలా మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని.. దీంతో వాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని కోరుతూ ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ స్కోరర్ వివేక్ గుప్తే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు.
అందే కాకుండా విశ్రాంత స్కోరర్లు 17 మంది తమకు వెంటనే బకాయిలు చెల్లించాలని గంగూలీకి మెయిల్ చేశారు. బీసీసీఐ గుర్తింపు పొందిన ఈ 17 మంది రోజుకు రూ.50 వేతనానికి పని చేయడం ప్రారంభించారని.. ప్రస్తుతం స్కోరర్‌కు రోజుకు రూ. 10 వేలు లభిస్తున్నాయని చెప్పారు. గతంలో పని చేసిన స్కోరర్లు ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయారు కాబట్టి బీసీసీఐ ఎంతో కొంత పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం స్కోరర్లుగా పని చేస్తున్న వారు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వివేక్ గుప్తే చెబుతున్నారు. ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు లేకపోవడంతో స్కోరర్లకు పని లేకుండా పోయిందని.. రోజుకు 10 వేలు సంపాదించిన స్కోరర్లు ఇప్పుడు నెలకు కూడా సంపాదించలేక పోతున్నారని ఆయన చెప్పారు. వీరికి కూడా బీసీసీఐ ఏదో ఒక భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.