- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
దారుణంగా ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి.. రోగం వస్తే సిటీకి.. లేకపోతే కాటికి
దిశ, బోథ్: అభం శుభం తెలియని 17 సంవత్సరాల అమ్మాయి. తండ్రి చనిపోయాడు.. అన్న, తల్లి కష్టపడి తనను చదివిస్తున్నారు. మంచిగా చదువుకొని తల్లి మరియు అన్నని మంచిగా చూసుకోవాలి అనుకున్న ఆమె ఆశలు డెంగ్యూ రూపంలో ఆవిరి అయిపోయాయి. వివరాలలోకి వెళ్తే బోథ్ మండలం దన్నుర్(బి) గ్రామానికి చెందిన నిమ్మల లావణ్య(17) డెంగ్యూతో ప్లేట్ లేట్స్ పడిపోవడంతో నిర్మల్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. పేరుకు బోథ్ పెద్ద నియోజకవర్గం అయినా ప్రభుత్వాసుపత్రిలో కనీస వసతులు సమకూర్చడంలో విఫలం అయ్యింది. ఇక్కడ పేరుకు CHC(క్లస్టర్ ఆసుపత్రి) ఉన్న నామ మాత్రం సేవలు ఉన్నాయి. ఇక్కడికి బోథ్ మండల వ్యాప్తంగా ఉన్న 33 గ్రామ ప్రజలు వస్తారు. కానీ, కనీస వసతులు లేకుండా వచ్చిన రోగులు మెరుగు అయిన చికిత్సకోసం సిటీకి వెళ్లాలి లేకుంటే కాటికి చేరుకోవడమే.
బోథ్ మండలంలోని ఆసుపత్రికి ఈ సీజనల్ వ్యాధుల ద్వారా రోజుకు 100 నుండి 200 వరకు వచ్చి పరీక్ష లు చేయించుకుంటున్నారు. రోజు మొత్తం ఒకే డాక్టర్ ఉండడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పేద కుటుంబాలు అటు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేక మరియు ఇటు ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైన ఆసుపత్రిలో కనీస వసతులు సమకూర్చాలి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దన్నుర్ గ్రామంలో డెంగ్యూతో మృతి చెందిన లావణ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికపరంగా ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.