‘విరాట పర్వం’లో మలార్ పాత్ర అది కాదు!

by Shyam |
‘విరాట పర్వం’లో మలార్ పాత్ర అది కాదు!
X

విరాట పర్వం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాయి పల్లవి లుక్‌కు మంచి మార్కులే పడ్డాయి. అమరవీరుల స్థూపం ముందు ఒడిలో పుస్తకం, చేతిలో పెన్ను, పక్కనే బ్యాగ్ పెట్టుకుని.. ఆలోచనలో ఉన్న సాయి పల్లవిది ఈ సినిమాలో తెలంగాణకు చెందిన నక్సలైట్, గాయని ‘బెల్లి లలిత’ పాత్ర అని వార్తలొచ్చాయి. కానీ అది వాస్తవం కాదని డైరెక్టర్ వేణు ఊడుగుల తాజాగా ఇంటర్వ్యూతో కన్‌ఫర్మ్ అయింది.

తను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తినని తెలిపిన వేణు.. ఎన్నో విప్లవ ఉద్యమాలకు ఓరుగల్లు కేంద్ర బిందువని చెప్పారు. సమాజంలో మార్పు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకులను చూస్తూ పెరిగానని, అదే స్ఫూర్తిని సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. కానీ అందరూ అనుకుంటున్నట్లు సాయి పల్లవిది ‘బెల్లి లలిత’ పాత్ర మాత్రం కాదన్నారు. తను సినిమాకు కీలకం అని.. విరాట పర్వం ద్వారా మలార్ బ్యూటీ మరో యాంగిల్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పాడు వేణు ఊడుగుల.

రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా.. మరో కీలక పాత్రలో నందితా దాస్ కనిపించబోతున్నారు.

Advertisement

Next Story