- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశ్వారావు పేట వాసి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి మూవీ..!
దిశ, అశ్వారావుపేట టౌన్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని కలలు కంటుంటారు. అయితే, ఎంతోమంది హేమాహేమీ దర్శకులకు అది ఇప్పటికీ తీరని కోరికగానే మిగిలింది. కానీ, అలాంటి అరుదైన గొప్ప అవకాశాన్ని ఓ యువ దర్శకుడు అందిపుచ్చుకోవడం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇంతటి ఘనత సాధించిన దర్శకుడు వెంకీ కుడుముల.. స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించి ప్రాథమిక విద్యను ఇక్కడే అభ్యసించి విజయవాడలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఎంజీ రంగాచార్య అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి సినిమాల పై మక్కువతో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
ఆ తర్వాత నాగశౌర్య, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘చలో’ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోని హిట్ కొట్టాడు. రెండో చిత్రం హీరో నితిన్, హీరోయిన్ రష్మిక తో ‘భీష్మ’ అనే సినిమా తెరకెక్కించి మరో హిట్‌ను సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు వెంకీ. కమర్షియల్ చిత్రాలు తీయడంతో వెంకీ కుడుముల స్టైల్ వేరు. తీసిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ యువ దర్శకుడు తర్వాత ఎవరితో మూవీ చేయబోతున్నాడని అంతా అనుకున్నారు. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వెంకీ కుడుముల సినిమా తీయబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. కొందరు ఈ వార్తలను ఖండించారు. అయితే, మంగళవారం వెంకీ కుడుముల తన సోషల్ మీడియా అకౌంట్‌లలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు అనౌన్స్ చేయడంతో స్థానికంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తమ ఊరి వాడు ఇంతటి ఉన్నత స్థానికి చేరడం పట్ల అశ్వారావుపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.