- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుకాణాదారులకు టెస్టులు చేయండి
న్యూఢిల్లీ: దుకాణాదారులు, కూరగాయల వ్యాపారులు, ఇతర వర్తకులకు కరోనా టెస్టులు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారిలో కరోనా ఉంటే సూపర్ స్ప్రెడర్‌లుగా మారి పెద్ద సంఖ్యలో ఇతరులకు వైరస్ అంటించే ప్రమాదముందని హెచ్చరించింది. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా వెంటనే అలాంటి చోట్ల టెస్టులు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
ప్రస్తుతం కరోనా కొత్త ఏరియాల్లోకి వ్యాపిస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, అలాగే, కరోనా మరణాలను ఎట్టిపరిస్థితుల్లో నియంత్రించాలని తెలిపారు. ఈ మరణాలపై వారంవారం ఆడిట్లు నిర్వహించాలని, తద్వారా ప్రాణాలు కాపాడటానికి ప్రధానంగా ఉన్న అవరోధాలు తెలిసివస్తాయని వివరించారు. వాటిని తొలగించడంపై దృష్టిపెట్టి మరణాలను తగ్గించవచ్చునని పేర్కొన్నారు.
ఆక్సిజన్ ఫెసిలిటీతో వెంటనే రెస్పాండ్ అయ్యే టీంలుగల అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, కొవిడ్ ఆసుపత్రల(ప్రైవటే, ప్రభుత్వ)లోని బెడ్ల వివరాలను ప్రజల చెంత ఉంచాలని సూచించారు. అలాగే, కరోనా పేషెంట్‌కు వారి కుటంబీకులతో మాట్లాడటానికి ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.