- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు కన్నా: వెల్లంపల్లి
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాల గురించి తెలిపారు. అలాగే ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తుతున్న వారిపై తనదైన శైలిలో మండిపడ్డారు.
ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను రాష్ట్రం కొనసాగిస్తున్నప్పటికీ పవన్, లక్ష్మీనారాయణ, చంద్రబాబులు విమర్శలు చేయడాన్ని వెల్లంపల్లి ఖండించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులకు, మసీదుల్లోని మౌజమ్, చర్చి పాస్టర్లకు రూ. 5 వేలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుని తీరాలని వెల్లంపల్లి అన్నారు.
ఓవైపు దేశంలో ఏ రాష్ట్రంలో చేయన్నని కరోనా టెస్టులు చేస్తున్నా, మరోవైపు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీ నారాయణ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, దేవినేని ఉమా పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఇంట్లో ఉండి దీక్షలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి సహాయం చేయటంలేదని ఆయన మండిపడ్డారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా కరోనా కట్టడిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడుతూ, విమర్శస్తున్న వారి మీద తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ది, జ్ఞానం లేదు.. యనమలకు ఏమైందని విమర్శించారు.
తప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని.. తప్పుడు లెక్కలు చెప్పే చరిత్ర చంద్రబాబుదని మల్లాది విష్ణు మండిపడ్డారు.
Tags – lockdown, corona, AP, CM, politics, Vellampalli, Minister, Jagan