- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kohli: ఈ రోజు ‘ఛేజ్‌మాస్టర్’ విరాట్ కోహ్లీ 36వ పుట్టినరోజు
దిశ, వెబ్ డెస్క్: నేడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli) 36వ పుట్టినరోజు(36th birthday) జరుపుకుంటున్నారు. వరల్డ్ కప్. ఐసీసీ చాంఫియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్‌లలో భాగాస్వామిగా ఉన్న కోహ్లీ.. ఎన్నో మ్యాచుల్లో భారత జట్టుకు అలవోకగా విజయాలు సాధించి పెట్టారు. దీంతో ఆయనకు మొదటి ఇన్నింగ్స్ లో అయితే రన్ మిషన్(Run mission) అని, రెండో ఇన్నింగ్స్ లో అయితే ‘ఛేజ్‌మాస్టర్’('Chasemaster')’ అంటూ ఆయన అభిమానులు పేరుపెట్టుకొని పిలుస్తుంటారు. 15 ఏళ్లకు పైగా అద్భుతమైన కెరీర్‌తో, కోహ్లి ఎప్పటికప్పుడు గొప్ప క్రికెటర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కోహ్లీ తన అద్బుతమైన ప్రదర్శనతో.. క్రికెట్‌లో 9 తిరుగులేని రికార్డులను నెలకొల్పాడు.
2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ(virak kohli).. 118 మ్యాచ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.29 సెంచరీలు, 31 అర్థ సెంచరీలతో 47.83 సగటుతో 9,040 పరుగులు చేశాడు, అతని పేరు మీద అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్ గా ఉంది. అలాగే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 2016-2019 మధ్యకాలంలో కోహ్లీ ఫామ్ అతని కెరీర్‌ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. 2016-19 మధ్యలో 43 టెస్టులు, 69 ఇన్నింగ్స్‌లలో 66.79 సగటుతో 16 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 4,208 పరుగులు చేశాడు. ఈ కాలంలోనే అతను ఏడు డబుల్ సెంచరీలు సాధించి.. టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధికంగా రికార్డు సృష్టించాడు.