పెళ్లై 11 ఏళ్ల బిడ్డ ఉన్న డాక్టర్‌తో ఆ స్టార్ డైరెక్టర్ రెండో వివాహం.. దుమారం రేపుతున్న న్యూస్

by Kavitha |
పెళ్లై 11 ఏళ్ల బిడ్డ ఉన్న డాక్టర్‌తో ఆ స్టార్ డైరెక్టర్ రెండో వివాహం.. దుమారం రేపుతున్న న్యూస్
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చివరిగా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Sing) హీరోయిన్‌గా నటించిన ‘కొండపొలం’(Konda Polam) మూవీకి దర్శకత్వం వహించిన ఈయన.. ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమా చేస్తూ తప్పుకున్నాడు. ప్రస్తుతం క్రిష్.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో ‘ఘాటీ’(Ghaati) సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. క్రిష్ జాగర్లమూడి కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధంలో కొన్ని మనస్పర్థలు రావడంతో మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇందులో భాగంగా వచ్చే వారం ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటున్నారట. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈయన ఈ సారి కూడా ఒక డాక్టర్‌నే వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆ డాక్టర్ విడాకులు తీసుకుని ఉంటున్నారని, ఆమెకు 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా క్రిష్ జాగర్లమూడి మొదటి భార్య రమ్య కూడా డాక్టర్ అన్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed