- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్ : రూ.2 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI's) కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన రూ. 2 వేల నోట్ల(Rs. 2000 notes) లో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. కేవలం రూ. 6,970 కోట్ల విలువ చేసే 2 వేల నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వీటిని సర్క్యులేషన్ నుంచి ఉపసంహరిస్తున్నట్లు 2023 మే నెలలో ప్రకటించింది. ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నప్పటికీ.. వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. 2016 నవంబరు నెలలో.. అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2 వేల విలువైన పెద్ద నోటును ప్రవేశపెట్టింది. తర్వాత క్రమంలో రూ. 2 వేల బ్యాంక్ నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ గతేడాది మే 19న ప్రకటించింది. అప్పటికి సర్క్యులేషన్లో ఉన్నటువంటి ఈ 2 వేల రూపాయల నోట్ల విలువ ఏకంగా రూ. 3.56 లక్షల కోట్లు. కాగా.. ఆర్బీఐ ప్రకటన తర్వాత ప్రజలు నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం చేశారు. ఇందుకోసం 2023, అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది. తొలుత రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ అవకాశం కల్పించింది.
ఇప్పుడు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనే 2 వేల రూపాయల నోట్లు ఉపసంహరించేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ సహా మొత్తం 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో వీటిని అప్పగించి.. వారి అకౌంట్లలోకి జమ చేసుకోవడం లేదా ఇతర నోట్లలోకి కూడా మార్చుకునే అవకాశం కల్పి్ంచారు. ఇప్పటికిని 2 వేల నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ.. రద్దు మాత్రం చేయలేదు. ఇప్పటికీ దీనిని చెల్లుబాటు కరెన్సీగానే పేర్కొంటుంది ఆర్బీఐ. ఇంకా రూ. 6970 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు జనం దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఇవి చెల్లుబాటు కరెన్సీ అయినప్పటికీ.. బయట తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించని నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే 100 శాతం నోట్లు వెనక్కి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తోంది.