AP High Court:మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

by Jakkula Mamatha |
AP High Court:మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం కేసు, పోలీసుల పై దాడి కేసులో వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Former MLA Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న ఏపీ హైకోర్టు(AP High Court) పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాస్‌పోర్ట్ అప్పగించాలని.. ప్రతివారం పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు భారీ ఊరట లభించింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన తన పాస్‌పోర్ట్‌ను తీసుకుని సింగపూర్‌ వెళ్లనున్నారు. తాను సింగపూర్ వెళ్లేందుకు బెయిల్ షరతుల్ని సడలించాలని ఇటీవల పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరపగా ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. నేడు(మంగళవారం) తీర్పును వెల్లడించింది.

Advertisement

Next Story