ఆటో పరిశ్రమ ఉత్పత్తితో పాటు విక్రయాలు పెరిగాయి : సియామ్!

by Harish |   ( Updated:2020-11-11 06:23:38.0  )
ఆటో పరిశ్రమ ఉత్పత్తితో పాటు విక్రయాలు పెరిగాయి : సియామ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో దేశీయ ఆటో పరిశ్రమ మొత్తంగా ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, టూ-వీలర్ వాహనాల ఉత్పత్తిలో 34.64 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌(సియామ్) గణాంకాలు వెల్లడించాయి. అమ్మకాలు సైతం అదే స్థాయిలో అక్టోబర్ నెలకు 3.10 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఈ వాహనాల అమ్మకాలు 2.71 లక్షల యూనిట్లతో పోలిస్తే 14.19 శాం పెరిగిందని సియామ్ తెలిపింది. టూ-వీలర్ అమ్మకాలు కూడా గతేడాదితో పోలిస్తే అక్టోబర్‌లో 16.88 శాతం పెరిగి 20,53,814 యూనిట్లకు చేరుకున్నాయి. టూ-వీలర్ విభాగంలో మోటార్‌సైకిల్ అమ్మకాలు 13,82,749 యూనిట్లతో 23.8 శాతం పెరిగాయి. స్కూటర్ అమ్మకాలు 1.79 శాతం పెరిగి 5,90,507 యూనిట్లకు చేరుకున్నాయి. ‘అక్టోబర్ నెలలో అమ్మకాల వృద్ధి సానుకూలంగా ఉంది.

పండుగ సీజన్ డిమాండ్ కారణంగా కొన్ని విభగాల్లో మెరుగుదల సంతృప్తిగా కనిపించాయని’ సియామ్ డైరెక్టర్ రాజేష్ మీనన్ చెప్పారు. అయితే, త్రీ-వీలర్ అమ్మకాలు మాత్రం 60.91 శాతం తగ్గి 26,187 యూనిట్లకు పరిమితమయ్యాయి. అక్టోబర్ నెలలో మారుతీ సుజుకి ఇండియా హోల్‌సేల్ విక్రయాలు 17.64 శాతం పెరగ్గా, హ్యూండాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 13.9 శాతం వృద్ధి సాధిచింది. కియా మోటార్స్ అత్యధికంగా 61.25 శాతం పెరిగింది. టూ-వీలర్స్‌లో హీరో మోటోకార్ప్ హోల్‌సేల్ విక్రయాలు 34.78 శాతం పెరిగాయి. హోండా టూ-వీలర్ విక్రయాలు 1.36 శాతం వృద్ధి సాధించింది. టీవీఎస్ విక్రయాలు 19.27 శాతం పెరిగాయి.

Advertisement

Next Story