- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనాల రిజిస్ట్రేషన్లు షురూ
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించినట్టుగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. బుధవారం నుంచి రాష్ట్రంలోని గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్‌లన్నింటిలో వాహనాలు, భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాహన రిజిస్ట్రేషన్‌ల కోసం ముందుగా వాహనదారులు స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉన్నందున బుధవారం అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్‌ల కోసం స్లాట్ బుకింగ్‌లను రవాణా శాఖ ప్రారంభించింది.
మార్చి 23వ తేదీ లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో వేలాది కొత్త వాహనాలకు ఫిజికల్ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే వాహనాలు రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని వాహనాలకైతే పర్మినెంట్ నెంబర్లను కూడా ఆన్‌లైన్‌లోనే ఇచ్చిన ఆర్టీఏ కార్యాలయాలు లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వాహనాన్ని వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుందని అప్పట్లో ప్రకటించాయి. కాగా, మార్చి 31తో గడువు ముగిసిన భారత్ స్టేజ్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ సైతం లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. దీంతో షోరూముల్లోనే మిగిలిపోయిన బీఎస్ 4 వాహనాలను అమ్ముకునే అవకాశం లేకుండా పోయిందని సుప్రీం కోర్టుకు వెళ్లిన డీలర్లకు అప్పట్లో కోర్టు ఊరటనిచ్చింది. దేశంలో మొదటి దశ లాక్‌డౌన్ ముగిసిన ఏప్రిల్ 14వ తేదీ తర్వాత 10 రోజుల పాటు వాహనాలు విక్రయించుకోవచ్చని అనుమతిచ్చింది. లాక్‌డౌన్‌కు ముందే విక్రయించిన వాహనాలను తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ను తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించడంతో ప్రస్తుతం బీఎస్ 4 వాహనాల అంశంపై ఏం చేయాలన్నదానిపై రవాణా శాఖ సమాలోచనలు చేస్తోంది. కోర్టు తీర్పుపై క్లారిటీ వచ్చాక ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ స్లాట్లు తగ్గిస్తామన్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చేవారు తప్పినసరిగా మాస్కులు ధరించాలని పాపారావు కోరారు. పని ఉన్న వారిని మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.
వాహన షోరూంలు త్వరలో ఓపెన్..?
హైదరాబాద్ నగరం రెడ్‌జోన్‌లో ఉండడంతో ప్రభుత్వం అనుమతిచ్చిన కొన్ని వ్యాపారాలు మాత్రమే బుధవారం ఓపెన్ అయ్యాయి. వాహనాలు విక్రయించే వాహన షోరూంలు ఓపెన్ కాలేదు. అత్యధిక వాహనాలు అమ్ముడై ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే రాజధానిలో వాహన షోరూంలు ఓపెన్ అవకుండా ఆర్టీఏలు తెరచి ఉపయోగమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోన్నది. దీన్నిబట్టి ప్రభుత్వం వీలైనంత త్వరలోనే హైదరబాద్‌లో వాహన షోరూంలు తెరచుకోవడానికి అనుమతివ్వడం ఖాయమని తెలుస్తోన్నది.
tags: lockdown, telangana, vehicle registration, bs4 vehicles