- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాహనదారులు తస్మాత్ జాగ్రత్త …!
దిశ, క్రైమ్ బ్యూరో: మీ వాహనాలపై కేసులు నమోదు అవుతున్నాయా.. అనవసరంగా ట్రాఫిక్ జరిమానాలు పడుతున్నాయా… అయితే మీ బండి నెంబర్ ప్లేట్ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో సరి చూసుకోండి. లేదంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. రోడ్లపై సరిగా లేని మన నంబర్ ప్లేట్ లను గమనిస్తున్న స్నాచర్లు అవే నంబర్ ప్లేట్ లతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో అసలు నంబర్ కలిగిన యజమానులకు కేసులు, ఫైన్‌లకు బలవుతున్నారు. అయితే, వాహనదారులు మీ మీ నంబర్ ప్లేట్లను సరి చూసుకొని.. సరి చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఇటీవల అబిడ్స్‌లో ఓ యువతి రోడ్డుపై ఫోన్ మాట్లాడుతుండగానే బైక్ పై వచ్చిన అగంతకుడు ఖరీదైన సెల్ ఫోన్‌ను స్నాచింగ్ చేశాడు. దీంతో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సరికాని నంబర్ ప్లేట్ కలిగిన వాహనాలపై కేసులు బుక్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒక్క రోజే నగరంలో సరికాని నంబర్ ప్లేట్లకు సంబంధించి 876 కేసులు నమోదు చేసినట్టు సీపీ అంజనీకుమార్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.