హైదరాబాద్‌లో 'వెజొల్యూషన్' ప్లాంట్!

by Harish |   ( Updated:2021-07-13 06:58:49.0  )
Vegolution india
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక ప్రొటీన్లతో పాటు తక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహార ఉత్పత్తులను విక్రయించే స్టార్టప్ కంపెనీ వెజొల్యూషన్ ఇండియా తెలంగాణలో తన తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వెజొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే 120 టన్నుల సామర్థ్యం కలిగిన తయారీ యూనిట్‌ను కలిగి ఉందని, తాజాగా హైదరాబాద్‌లో రెండో యూనిట్‌ను ప్రారంభించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కంపెనీ సీఈఓ సిద్ధార్థ రామ సుబ్రమణియన్ చెప్పారు.

హైదరాబాద్ మార్కెట్లోకి కొత్తగా సోయా బీన్‌తో తయారైన ‘హలో టెంపె’ ఉత్పత్తులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. తమ ఉత్పత్తులను సులభంగా వండుకునే వీలుంటుందన్నారు. హైదరాబాద్ నాలుగో అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ కావడంతో హలో టెంపెను ఇక్కడ తీసుకొస్తామని, మొత్తం నాలుగు ఫ్లేవర్లలో ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ఉత్పత్తులు బిగ్‌బాస్కెట్, సూపర్‌డైలీ, బీబీ డైలీ, ఇంకా అనేక రిటైల్ స్టోర్లలో లభిస్తుందని, ఈ నెలాఖరు నాటికి అందుబాటులో ఉండనున్నట్టు సిద్ధార్థ వెల్లడించారు.

Advertisement

Next Story